మాదారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కు విశేష స్పందన 

సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ 

మాదారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కు విశేష స్పందన 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 02 :

కారేపల్లి మండలం మాదారం గ్రామ పంచాయతీ లో " ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక  " కార్యాచరణ  99 రోజుల కార్యక్రమానికి సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ గ్రామ పంచాయతీ కీ అందిస్తున్న  పనులకు గాను గ్రామ ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. మాదారం, గోవిందు తండా గ్రామ ప్రజల మన్నలను అందుకుంటూ గ్రామలా అభివృద్ధి పదంలో పలు గ్రామాలకు ఆదర్శవంతంగా ముందుకు నడుస్తున్నారు. ప్రజా పాలన కార్యక్రమం లో గ్రామాల్లో ఎటువంటి ప్రశ్నలకు తావు లేకుండా ముందు గానే ప్రజల సమస్యలను గ్రహించి నెరవేర్చడం జరుగుతుంది. సర్పంచ్ ఉమా నరేష్ సమ్మర్ లో గ్రామ పంచాయతీ ప్రజలు నీటి సమస్యలతో ఇబ్బంది పడవద్దు అనీ ముందస్తు గానే గ్రామ వీధుల్లో పైపు లైన్ లీకేజ్ సమస్యలను తీర్చడం జరిగింది. గ్రామ రహదారుల విషయం లో ప్రత్యేక చొర్వతీసుకొని సిబ్బంది సహాయం తో శుభ్రం చెయ్యడం జరిగింది. మాదారం గ్రామ పంచాయతీ ప్రజలు రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని గ్రామ వీధుల్లోనీ డ్రైనేజీ వ్యవస్థ లో పేరుకు పోయినా చెత్త చేదరాన్ని,నిల్వ ఉంటున్న నీటిని మరల పునరావృతం కాకుండా మెరుగు పరచడం జరిగింది. గ్రామ పంచాయతీ లో ఉన్న ప్రతీ ఒక్క అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ చిన్న పిల్లల ఆరోగ్యం, పోషణ, గర్భిణీ స్త్రీల సమస్యలు తలెత్త కుండా ప్రత్యేక శ్రద్ద చూపడం, పల్లె దావఖాన్లో ప్రజల ఆరోగ్య సమస్యలు రాకుండా పై అధికారులతో సంప్రదింపులు జరిపి కావాల్సిన వైద్య పరికరాలను సమాకుర్చడం జరిగింది.గ్రామాల్లో ప్రజల ఆరోగ్య విషయంలో ఎందరికో మంత్రుల సహకారంతో ఎల్ వో సీ లాంటి నిధులను సమాకుర్చడం , గ్రామ పంచాయతీ కీ ప్రత్యేక చొరవతో హ్యాండ్ పంపులను సమాకుర్చడం వంటి పనులను ముందస్తు గానే పనులను పూర్తి చెయ్యడం జరుగుతుంది. ప్రజా పాలన , గ్రామ సభల్లో ప్రజల నుండి మన్నలను పొందటం తప్ప , ప్రశ్నలకు తావ్ లేకుండా మాదారం గ్రామ పంచాయతీ నీ సర్పంచ్ ఉమా నరేష్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ లాలు మంగ ,స్పెషల్  ఆఫీసర్ శ్రీకాంత్ , పంచాయతీ సెక్రటరీ విజయ్ , వార్డ్ మెంబర్లు, వివిధ పార్టీలా నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News