తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్గొండ జిల్లా ప్రధాన
కార్యదర్శిగా తలారి యాదయ్య.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన తలారి యాదయ్య ను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇట్టి నియామక పత్రాన్ని నల్గొండ జిల్లా టి యు ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కే .శ్రీనివాస్, జిల్లా నాయకులు వల్కి వెంకటేశం, పి యు జె ఎ సి నాయకులు వై. రాంబాబు యాదవ్, గంజి రాజేందర్,లెక్చరర్ లు, డి .మహేందర్, సుధాకర్, పెండెం ధనుంజయ, గంజి వెంకన్న లు, సీనియర్ ఉద్యమ కారులు రేఖల బిక్షo ల చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి,మలి దశ, ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు టి యు ఎఫ్ తరుపున ఉద్యమించాలని కోరారు.ఈ ఎన్నికకు కృషి చేసిన రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు మరియు ఉమ్మడి జిల్లా టి యు ఎఫ్ నాయకులoదరికీ తలారి యాదయ్య కృతజ్ఞతలు తెలిజెసారు.
