మనుమయ( కమ్మరి, వడ్రంగం) సంఘం

జనగామ జిల్లా అధ్యక్షునిగా దీగోజు. సాంబచారి ఏకగ్రీవ ఎన్నిక

మనుమయ( కమ్మరి, వడ్రంగం) సంఘం

 జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):-

 తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం విస్తృతస్థాయి సమావేశం జనగామ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు దీగోజు నరసింహ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నేడు కమ్మరి వడ్రంగి వృత్తిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అన్నారు. 15 అంశాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది అని హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ అందించి 50 సంవత్సరాలకు పైబడిన వారికి పెన్షన్ 5000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు, కోశాధికారి గ్రంథాల శ్రీనివాస్ చారి, సోషల్ మీడియా చైర్మన్ మేడోజు శంకరాచారి, ప్రచార కార్యదర్శి మేడోజు రాం బ్రహ్మం, బీసీ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ అనంతోజు బ్రహ్మచారి, పాల్గొనగా జిల్లాలోని అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో విశ్వకర్మ కమ్మరి వడ్రంగి వృత్తిదారులు హాజరైనారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ ని నియమించారు.
 జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా దీగోజు నరసింహాచారి, జిల్లా అధ్యక్షునిగా  దీగోజు సాంబాచారి, ప్రధాన కార్యదర్శిగా సాతెల్లి రాజు, కోశాధికారి మారపల్లి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులుగా బండ్ల మల్లేష్ చారి, ప్రచార కార్యదర్శి చెల్లోజు నవీన్ కుమార్  ని నియమించినారు

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి