డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని.

చందుపట్ల దేవేందర్ రెడ్డి దంపతులు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి- శ్రీనివాస్ రెడ్డి

డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని.

 



హనుమకొండ జిల్లా ప్రతినిధి జనవరి 10 లోకల్ గైడ్ IMG-20260110-WA0086వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో శనివారం 52వ డివిజన్ పరిధిలోని వాగ్దేవి కళాశాల వెనుక భాగంలో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డ్రైనేజీ పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తగ్గి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నయీం నగర పరిసర ప్రాంతాల్లో నాలాల వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించిందని, ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు.అనంతరం వాగ్దేవి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలను వెలిగించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ, అభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో చందుపట్ల దేవేందర్ రెడ్డి దంపతులు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి-బిజెపి సీనియర్ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి ,డివిజన్ అధ్యక్షులు తడుక సుమన్,డైరెక్టర్ శ్రవణ్ రెడ్డి,నాయకులు సుగుణాకర్ రెడ్డి,అశ్విన్ రాథోడ్,బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి