ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బీజేపీ మోడీ ప్రభుత్వ
విధానాలకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవాన్ని జరపండి.
By Ram Reddy
On
ప్రగతిశీల మహిళా సంఘం పిలుపు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 5.
నార్కట్ పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో పి.ఓ.డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉపాధి హామీ మహిళా కూలీలతో సమావేశం నిర్వహించారు.అనంతరం పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర కమిటీ ముద్రించిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి పజ్జూరు ఉపేంద్ర పాల్గొని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం శ్రామిక వర్గ మహిళల పై పనిభారాన్ని మోపుతూ, వారి శ్రమను దోచుకునేందుకు అదనపు పని గంటలు పెంచుతూ, కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి, బడ్జెట్లో కోతలు విధిస్తూ క్రమంగా ఆ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఇది 26 లక్షల కోట్ల ఉపాధి జాబ్ హోల్డర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా పని దొరికేది మహిళలకు, దళిత, ఆదివాసి, గిరిజనులకు మాత్రమేనని ఆ చట్టాన్ని రద్దు చేస్తే ఆ సామాజిక వర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విమర్శించారు. పేరు మార్చిన ఈ పథకానికి 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు ఖర్చులు భరించాలని నిర్ణయించడం అంటే దాన్ని క్రమంగా ఎత్తివేసే ఆలోచనేనని అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం చట్టాలలో మార్పులు చేస్తూ ముఖ్యంగా మహిళ శ్రామిక వర్గంపై భారాలు మోపడానికి పూనుకున్నదని, ఈ విధానాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని 1 నుండి 8 వరకు గ్రామ గ్రామాన నిర్వహించాలని POW రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని అందులో భాగంగా 7న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో సభ నిర్వహిస్తున్నామని, ఈసభ కు మహిళా లోకం అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకులు తోడుసు జయ లక్ష్మి, మట్టిపెల్లి లింగమ్మ, పజ్జూరు పద్మ, చిరబోయిన కళమ్మ, మీడిదొడ్డి ధనమ్మ, పజ్జూరు స్వరూప, సత్తమ్మ, గొలుసుల యాదమ్మ, ఖమ్మoపాటి సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
.
Tags:
About The Author
Latest News
18 Mar 2026 16:34:32
ఖమ్మం, మార్చి -18:లోకల్ గైడ్ :----------------------------196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్...
