మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని రక్షించుకొండి - డిఫెన్సె కౌన్సెల్ లక్ష్మిపతి గౌడ్
నారాయణపేట ఏప్రిల్ 9:
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలకు అనుగుణంగా గురువారం నాడు జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ నారాయణపేట వారి ఆధ్వర్యంలోఉట్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా న్యాయ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సెల్ కే . లక్ష్మీపతి గౌడ్ ఏర్పాటు చేసారు .ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సెల్ లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ జరుపుకొంటూన్నామని , ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అయితే, నిత్యం పనుల్లో బిజీగా గడిపేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తు న్నారని , ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరియు మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, బిజీ బిజీగా ఉన్న జీవన విధానములో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నరని, దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు . ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం, వేళకు భోజనం: విటమిన్లు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కూరగాయలు తీసుకోవా లని , దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవని, పండ్లు ఎక్కువగా తినడం వల్ల మీ శరీరం చక్కగా, సరిసమానంగా ఉంటుందని , తీపి, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం జోలికి వెళ్లకూ డదని, అలాగే, సోడా ఎక్కువగా ఉండే పానీయా లు తాగొద్దని, వ్యాయామం చేసేందుకు సమయం లేనట్లయితే మీ ఇల్లు లేదా ఆఫీసుల్లో లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగింఛాలని, రాత్రివేళ్లలో సరైన నిద్ర అవసరమని, మానసిక ఒత్తిడిలకు గురి కావొద్దని , యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచునని తెలిపారు.ఈకార్యక్రమంలో డాక్టర్ర్లు సంతోషి , భవాని, ఏ ఎస్సై సంజీవయ్య పోలీస్ సిబ్బంది , అంగన్వాడి టీచర్లు , ఆశావర్కర్లు , గ్రామా ప్రజలు, పారా లీగల్ వాలంటీర్లు హాజమ్మ , నారాయణ , పాల్గొన్నారు .
ఫోటో రైట్ అప్: 10.అవగాహన కల్పిస్తున్న అధికారులు
______________________
