తెలంగాణ అస్తిత్వ శిఖరం.. స్వరాష్ట్ర సాధకుడు,తెలంగాణ జాతిపిత కేసీఆర్. మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
కొందుర్గ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు
పెద్ద సంఖ్యలో హాజరైన కొందుర్గ్ మండల పార్టీ కార్యకర్తలు,నాయకులు
కొందుర్గ్ లోకల్ గైడ్ తెలంగాణ అస్తిత్వ శిఖరం స్వరాష్ట్ర సాధకుడు ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటిగా నిలిచి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి మహానీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని కొందుర్గ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో
పాల్గొని మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్ది, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ .దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో ఆయన నిండు నూరేళ్లు బ్రతికి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో, కేసీఆర్ అభిమానులతో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కొందుర్గ్ గ్రామ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్,మాజీ జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ, డిప్యూటీ సర్పంచ్ చంద్రశేఖర్ PACS డైరెక్టర్ జగదీశ్వర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగమొల్ల గోపాల్,సర్పంచులు, వార్డు సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
