వంగూరి వాచకం -నవరత్నాలు
By Ram Reddy
On
లోకల్ గైడ్
చిక్కులు వచ్చినప్పుడే
పిక్కబలం తెలిసేది
కుక్కలు వెంటపడినప్పుడే.
2.అహం ఆవేశాలతో
పెరుగునా పరువు ప్రతిష్ట
అలల ఎగిసిపాటుతో
మారునా సముద్ర మట్టం.
3.నిమ్మకు నీరెత్తినట్లుండే
ఉదాసీనతను నీవేల ధిక్కరించవు
చిమ్మ చీకటిని చిన్నదైన
మిణుగురు పురుగైనా వెక్కిరించదా.
4.మనుషులను కలిపేది
మాటలు
మనువులను కలిపేది
మూటలు .
5.అసాధ్యం అంటూ
నీవేల నిలువెల్ల భయపడేవు
గుడ్డును సైతం ఛేదించుకుని
కోడిపిల్ల బయటపడేనుగా.
6.పిల్లలు ఎల్లలు
దాటుతున్నారని దిగులు వీడు
రెమ్మలు కొమ్మలై
విస్తరిస్తున్న ముదము చూడు.
7.పెద్దలంటే ఎందుకు
అంత ఉదాశీనత
గోడలే గోపురానికి
చేయును కదా భద్రత.
8.ఒక్క తప్పు
నీవు చేస్తే చాలు
పిక్కు చెక్కులు
నీకు తెర లేపు
9.నీవెంత బిర్యాని తిన్నా
నాయొక్క ఆకలి తీరునా
సునామీకి బినామీని
పెడతానంటే కుదురునా.
వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్
Tags:
About The Author
Latest News
13 Feb 2026 19:18:55
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్
*శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*
*డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*
*ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
