రెవెన్యూ శాఖలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను కొనసాగించాలి.

అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)కు వినతి పత్రం అందజేసిన

రెవెన్యూ శాఖలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను కొనసాగించాలి.

రంగారెడ్డి జిల్లా టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు

రంగారెడ్డి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను నిలిపివేయాలనే సీసీఎల్‌ఏ కార్యాలయం నుండి ఇటీవల జారీ చేసిన మెమోపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రంగారెడ్డి జిల్లా టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 632 మంది టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తుండగా, రంగారెడ్డి జిల్లాలో 42 మంది సేవలందిస్తున్నారు. తమ సేవలను నిలిపివేస్తే, తమతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల కాలంలో నియమించబడిన తాము అనేక సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో నిరంతరా యంగా సేవలందిస్తూ, శాఖ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమలో చాలా మంది వయోపరిమితి దాటిపోయి నందున ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ నేపథ్యంలో 632 మంది సిబ్బంది, వారి కుటుంబాల సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా ఈ ఉద్యోగంపై ఆధారపడి ఉందని, సేవలను నిలిపివేస్తే తీవ్ర ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని విన్నవించారు. అందువల్ల మెమోను పునఃపరిశీలించి తమ సేవలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, రాజు, అనిల్, శ్రీనివాస్, పరమేశ్వర్, సుజాత, కామాక్షి, వనజ, వివిధ కలెక్టరేట్, ఆర్డీఓ, మండల కార్యాలయాల ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News